భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు నుంచి అక్రమంగా తరలిస్తున్న సింగరేణి సిమెంట్ బస్తాల వాహనాన్ని సింగరేణి భద్రతా సిబ్బంది సోమవారం పట్టుకున్నారు. సింగరేణి సివిల్ పనులకు ఉపయోగించే సిమెంట్ బస్తాలు... పట్టణంలో ఓ చోట నిల్వ ఉన్నాయి. వాటిని అక్రమంగా తరలిస్తున్న విషయాన్ని తెలుసుకున్న సింగరేణి భద్రతా సిబ్బంది తోగూడెం గ్రామం వద్ద ఆ వాహనాన్ని పట్టుకున్నారు. వాహనంలో 43 గ్రేడ్ కలిగిన రెండు వందల సిమెంట్ బస్తాలు ఉన్నాయి.
సింగరేణి సిమెంట్ బస్తాలు పట్టివేత - telangana latest news
అక్రమంగా తరలిస్తున్న సింగరేణి సిమెంట్ బస్తాల వాహనాన్ని సింగరేణి భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఏరియా సింగరేణి భద్రతాధికారి శబీరుద్దీన్ తెలిపారు.
Seizure of illegally moving Singareni cement bags
అనంతరం విషయం తెలుసుకున్న సింగరేణి విజిలెన్స్ అధికారులు సిమెంట్ బస్తాలు నిల్వ ఉంచిన ప్రదేశాన్ని తనిఖీ చేశారు. అక్కడ మరో 240 సిమెంట్ బస్తాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఏరియా సింగరేణి భద్రతాధికారి శబీరుద్దీన్ తెలిపారు.
ఇదీ చదవండి:సీఎం కేసీఆర్కు ఎంపీ కోమటిరెడ్డి బహిరంగ లేఖ