తెలంగాణ

telangana

ETV Bharat / state

అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో 417 కేజీల గంజాయి స్వాధీనం

భద్రాచలం సరిహద్దు ప్రాంతంలో భారీ గంజాయిని సీఆర్​పీఎఫ్ జవాన్లు, పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. రెండు కార్లు అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీలు నిర్వహించి 417 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో 417 కేజీల గంజాయి స్వాధీనం
అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో 417 కేజీల గంజాయి స్వాధీనం

By

Published : Aug 6, 2020, 3:52 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చత్తీస్​ఘడ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన భద్రాచలంలో సీఆర్​పీఎఫ్ జవాన్లు, పోలీసులు భారీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. భద్రాచలం చెక్​పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లు పోలీసులకు రెండు కార్లు అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 417 కేజీల గంజాయి బయటపడింది. ఒడిశాలోని మల్కన్​గిరి జిల్లా నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్​కు తరలిస్తుండగా పట్టుకున్నామని భద్రాచలం ఏఎస్పీ రాజేష్​చంద్ర వెల్లడించారు.

మొత్తంగా 14 గంజాయి కేసులు...

రెండు కార్లను సీజ్ చేసి గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు. గంజాయి విలువ సుమారు రూ. 62 లక్షల 73 వేలు ఉంటుందని వివరించారు. గత 45 రోజుల్లో భద్రాచలంలో 14 గంజాయి కేసులు నమోదైనట్లు స్పష్టం చేశారు. మొత్తం మీద రూ.రెండు కోట్ల విలువగల రెండు వేల కేజీల గంజాయిని పట్టుకున్నట్లు ఏఎస్పీ పేర్కొన్నారు.

ఇవీ చూడండి : వరంగల్​ రామాలయంలో ప్రత్యేక పూజలు

ABOUT THE AUTHOR

...view details