Rain effect on Seethamma sagar : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం గ్రామం వద్ద ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు అంతరాయం ఏర్పడింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంతోపాటు ఎగువన జిల్లాల్లో భారీ వర్షం కురవడంతో వరద నీరు గోదావరికి పోటెత్తి... ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతం నీటమునిగింది.
Rain effect on Seethamma sagar: నిలిచిన సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులు.. - కుమ్మరిగూడెం ప్రాజెక్టు పనులు
Rain effect on Seethamma sagar : ఇటీవల కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరదనీరు పోటెత్తింది. ఈ నేపథ్యంలో భద్రాద్రి జిల్లాలోని కుమ్మరిగూడెం వద్ద నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి.
![Rain effect on Seethamma sagar: నిలిచిన సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులు.. Rain effect on Seethamma sagar, KUMMARIGUDEM PROJECT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14206831-668-14206831-1642402084903.jpg)
నిలిచిన సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులు
అకస్మాత్తుగా గోదావరికి వరద నీరు పెరగడంతో సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. కాపర్ డ్యాం కొట్టుకుపోవడంతో పాటు... 5, 6 బ్లాకుల్లోని నిర్మాణ యంత్రాలు, జనరేటర్లు నీట మునిగాయి. అదృష్టవశాత్తు భారీ వాహనాలు నది వెలుపల ఉండటంతో ఆస్తి నష్టం తప్పింది. వరద ప్రవాహం తగ్గుముఖం పట్టగానే డ్రీ వాటరింగ్ చేసి... రెండు మూడు రోజుల్లో పనులు తిరిగి ప్రారంభిస్తామని సీతమ్మ సాగర్ ఎస్ఈ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి:Road Works: అనూహ్యంగా పెరిగిన తారు ధరలు... నిలిచిపోతున్న పనులు