భద్రాద్రి రామయ్య సన్నిధిలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం లక్ష్మణ సమేత సీతారాములను వెండి రథంలో ప్రత్యేకంగా ఊరేగించారు. కన్నుల పండుగగా దర్శనమిస్తున్న స్వామివారిని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం స్వామివారికి దర్బార్ నిర్వహించి సూర్యప్రభ వాహనంపై తిరు వీధుల గుండా విహరింపజేశారు.