తెలంగాణ

telangana

ETV Bharat / state

అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్న ప్రిన్సిపల్​.. తల్లిదండ్రుల ఆందోళన - పటాన్​చెరులో విద్యార్థిని కొట్టిన టీచర్​

Principal Sexually Assaulted 10th Class Student: విద్యను నేర్పించాల్సిన గురువే.. విద్యను నేర్పించకుండా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే ఆ గురువును ఏం అనాలి. ఈ సమాజం ఎటువైపు వెళుతుందో ఆందోళన చెందాల్సిన అవసరం ఏంతైనా ఉంది. యాదాద్రి జిల్లా భువనగిరిలోని ప్రైవేటు పాఠశాలలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది.

sexually harassing
sexually harassing

By

Published : Mar 21, 2023, 6:08 PM IST

Principal Sexually Assaulted 10th Class Student: ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్​ పదవ తరగతి విద్యార్థినిని లైంగికంగా వేధిస్తున్నాడంటూ.. విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాల ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో జరిగింది. నగరంలోని కృష్ణవేణి టాలెంట్​ స్కూల్​ల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిని ప్రత్యేక తరగతుల పేరుతో ప్రిన్సిపల్ రఘు వెంకట సురేశ్​ ​ లైంగికంగా వేధిస్తున్నాడనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం విద్యార్థినుల తల్లిదండ్రులకు తెలియడంతో వారు ప్రిన్సిపల్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాఠశాల ప్రిన్సిపల్​, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. గతంలో కూడా ప్రిన్సిపల్​ రఘు వెంకట సురేశ్​పై ఇలాంటి ఆరోపణలే వచ్చాయని గుర్తు చేశారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో.. వారు అక్కడకు చేరుకున్నారు. ప్రిన్సిపల్​పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు డిమాండ్​ చేశారు. పాఠశాల ముందు విద్యార్థినులు కూర్చొని నిరసన తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్​ ​ చాంబర్​లో తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థినులు ఆరోపించారు. ఇదే విషయాన్ని తాము తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు.

వెంటనే ప్రిన్సిపల్​ను విధుల నుంచి తొలగించి.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా విద్యా శాఖ అధికారి నారాయణ రెడ్డి పాఠశాలను సందర్శించి.. ఈ విషయంపై ప్రిన్సిపల్​ని ప్రశ్నించారు. అందుకు సంబంధించిన విషయాలపై వివరాలు సేకరించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని, చిల్డ్ ప్రొటెక్షన్ అధికారి పాఠశాలను సందర్శించి విద్యార్ధినుల నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. తల్లిదండ్రులను పోలీసులు సముదాయించి.. అక్కడి నుంచి పంపించివేశారు. వెంటనే ప్రిన్సిపల్​ను పోలీసులు పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

హోంవర్క్​ చేయలేదని కొట్టిన టీచర్​: మరోవైపు విద్యార్థిని హోంవర్క్​ చేయలేదని ఉపాధ్యాయురాలు కొట్టిన సంఘటన రంగారెడ్డి జిల్లా పటాన్​చెరులోని నాయి కోటి బస్తీలో చోటుచేసుకుంది. పట్టణంలోని సెయింట్​ జోసెఫ్​ స్కూల్​లో మూడో తరగతి చదువుకుంటున్న చిన్నారిని హోంవర్క్​ చేయలేదని టీచర్​ కొట్టడంతో గాయాలయ్యాయి. దీంతో ఈ విషయంపై స్కూల్​ యాజమాన్యాన్ని ప్రశ్నించడానికి చిన్నారి తల్లి వెళ్లింది. పిల్లలు హోంవర్క్​ చేయకపోతే తల్లిదండ్రులకు చెప్పాలి కానీ.. ఇలా కొట్టడం దారుణమని తల్లి పాపోయింది. అయితే ఆమెతో పాటు వచ్చి వ్యక్తి మద్యం సేవించి స్కూల్​లో భయానక వాతావరణాన్ని సృష్టించాడని.. పాఠశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్​ సిబ్బంది వచ్చేలోగే అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతను గురించి చిన్నారి తల్లిని అడగ్గా.. అతను ఎవరో తనకు తెలియదని చెప్పినట్లు సమాచారం.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details