తెలంగాణ

telangana

ETV Bharat / state

శిథిలావస్థలో పాఠశాల భవనం - హరిజన బస్తి

శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు. ఈ దృశ్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం హరిజనబస్తిలో చోటుచేసుకుంది.

School building in ruins at bhadradri kothagudem district
శిథిలావస్థలో పాఠశాల భవనం

By

Published : Mar 15, 2020, 12:03 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం హరిజనబస్తిలో ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. రేపో మాపో అన్నట్లుగా కూలిపోయే పరిస్థితిలో ఉంది. స్లాబ్ పెచ్చులూడి ఏ క్షణాన ప్రమాదం ఉందో తెలియక విద్యార్థులు భయంతో పాఠశాలకు వస్తున్నారు.

ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి పాఠశాల భవన నిర్మాణాన్ని చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.

శిథిలావస్థలో పాఠశాల భవనం

ఇదీ చూడండి :కరోనా భయంతో డీమార్ట్​లో పరీక్షలు!

ABOUT THE AUTHOR

...view details