తెలంగాణ

telangana

ETV Bharat / state

హరితహారం మొక్కలను పరిశీలించిన ప్రభుత్వ విప్​ రేగా కాంతారావు - హరితహారం మొక్కలను పరిశీలించిన రేగా కాంతారావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో ఆరో విడత హరితహారంలో భాగంగా నాటేందుకు తీసుకొచ్చిన మొక్కల్ని ప్రభుత్వ విప్​ రేగా కాంతారావు పరిశీలించారు. ప్రజలందరూ మొక్కల్ని నాటాలని.. వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని ఆయన సూచించారు.

saplings planting at manuguru panchyati officer a
హరితహారం మొక్కలను పరిశీలించిన రేగా కాంతారావు

By

Published : Jun 27, 2020, 8:56 PM IST

తెలంగాణలో పల్లెలు.. ప్రగతి దిశగా పయనిస్తున్నాయని ప్రభుత్వ విప్​ రేగా కాంతారావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో నాటేందుకు మూడు లక్షల వ్యయంతో తీసుకొచ్చిన మొక్కల్ని పరిశీలించారు. అనంతరం ఆరో విడత హరితహారంలో భాగంగా రేగా మొక్కలు నాటారు.

పంచాయతీల అభివృద్ధికి, సంక్షేమానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని రేగా కాంతారావు గుర్తు చేశారు. గ్రామాభివృద్ధి విషయంలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి అలసత్వం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. గ్రామాల్లో అనుమతులు లేకుండా చెట్లు నరికితే రూ.ఐదు నుంచి పదివేల వరకు జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details