కరోనా కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని నిలిపివేసిన సంధ్య హారతి ఆర్జిత సేవలను శుక్రవారం పునః ప్రారంభించారు. ఆలయ అధికారులు, అర్చకుల నిర్లక్ష్యం కారణంగా అపశృతి చోటు చేసుకుంది. సుమారు గంట సేపు జరగాల్సిన ఈ సంధ్య హారతి ఉత్సవాన్ని ఆలయ అర్చకులు తూతూమంత్రంగా నిర్వహించారు.
సంధ్య హారతి ఆర్జిత సేవలో అపశృతి.. తప్పిన ప్రమాదం - telangana news
కరోనా కారణంగా భద్రాద్రి రామయ్య సన్నిధిలో నిలిపివేసిన సంధ్య హారతి ఆర్జిత సేవలు శుక్రవారం పున ప్రారంభం అయినప్పటికీ... ఆలయ అధికారులు, అర్చకుల నిర్లక్ష్యం కారణంగా అపశృతి చోటు చేసుకుంది. అష్టోత్తర హారతికి బదులు నక్షత్ర హారతి అందించే సమయంలో మంటలు చెలరేగాయి. వెంటనే హారతిని బయటకు తీసుకెళ్లడం వల్ల ప్రమాదం తప్పింది.
సంధ్య హారతి ఆర్జిత సేవలో అపశృతి.. తప్పిన ప్రమాదం
అష్టోత్తర హారతికి బదులు నక్షత్ర హారతి అందించే సమయంలో మంటలు చెలరేగాయి. వెంటనే హారతిని బయటకు తీసుకెళ్లగా ప్రమాదం తప్పింది. అర్చకులు నిర్లక్ష్యం వల్లనే ఆలయంలో అపశృతి చోటు చేసుకుందని భక్తులు తెలిపారు.
ఇదీ చదవండి:ఫిబ్రవరి 11న జీహెచ్‌ఎంసీ నూతన మేయర్ ఎన్నిక