భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రామయ్య ఆలయంలో సంధ్యా హారతిల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉపాలయంలో వేంచేసి ఉన్న లక్ష్మీ తాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అద్దాల మండపంలో సంధ్య హారతి ఉత్సవం వైభవంగా జరిపారు.
భద్రాద్రి ఆలయంలో వైభవంగా సంధ్య హారతి ఉత్సవం - sandhya harathi news
భద్రాచలంలోని రామయ్య ఆలయంలో సంధ్య హారతి ఉత్సవం వైభవంగా జరిగింది. ప్రధాన ఆలయంలో లక్ష్మణ సమేత సీతారాములను అద్దాల మండపం వద్దకు తీసుకువచ్చి... గజ, అశ్వ, శేష, గరుడ అష్టోత్తర శత హారతులు అందించారు.
భద్రాద్రి ఆలయంలో వైభవంగా సంధ్య హారతి ఉత్సవం
ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములను అద్దాల మండపం వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. గజ, అశ్వ, శేష, గరుడ అష్టోత్తర శత హారతులు అందించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆయా గ్రహ బాధల నుంచి తప్పించుకోవాలంటే... హారతులు అందుకోవాలని పూజారులు సూచించారు.
ఇదీ చూడండి:చెర్వుగట్టులో వైభవంగా కల్యాణ మహోత్సవం