భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రామయ్య సన్నిధిలో పునర్వసు నక్షత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రాకార మండపంలోని ఉత్సవ స్వర్ణ మూర్తులకు స్నపన తిరుమంజనం మంగళవాయిద్యాల నడుమ కన్నుల పండువగా నిర్వహించారు. అండాలమ్మ తల్లికి ఏకాంతంగా అభిషేకం జరిపారు.
కన్నుల పండువగా రాములోరి స్నపన తిరుమంజనం - bhadradri district news
భద్రాచలంలోని రామయ్య సన్నిధిలో పునర్వసు నక్షత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రాకార మండపంలోని ఉత్సవ స్వర్ణ మూర్తులకు స్నపన తిరుమంజనం మంగళవాయిద్యాల నడుమ కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ ఏఈవో శ్రావణ్ కుమార్ శ్రీరామ పాదుకలను తలపై మోస్తూ ప్రదక్షిణ చేశారు.
రాములోరి స్నపన తిరుమంజనం
గత నెలలో శ్రీరామ దీక్షలు స్వీకరించిన భక్తులు నేడు ఆలయంలో దీక్ష విరమణ చేశారు. అనంతరం లక్ష్మణ సమేత సీతారాముల ఎదుట సహస్ర పూజలు నిర్వహించారు. ఆలయ ఏఈవో శ్రావణ్ కుమార్ శ్రీరామ పాదుకలను తలపై మోస్తూ ప్రదక్షిణ చేశారు. రేపు పుష్యమి నక్షత్రం సందర్భంగా లక్ష్మణ సమేత సీతారాములకు పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు.
ఇదీ చదవండి:అన్నాడీఎంకే నుంచే సీఎం అభ్యర్థి: భాజపా