భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల రామయ్యకు సేవ చేసి ఎంగిలి పండ్లను తినిపించిన గిరిజన మహిళ శబరి స్మృతియాత్ర ఈ ఏడాది నిరాడంబరంగా నిర్వహించారు. తండ్రి మాటను కాదనలేక వనవాసానికి వెళ్లిన సీతారాములకు సేవలందించిన అపర భక్తురాలు శబరి స్మృతియాత్ర ఏటా ఘనంగా జరిపేవారు.
భద్రాద్రిలో నిరాడంబరంగా శబరి స్మృతియాత్ర - భద్రాద్రి రామయ్య ఆలయంలో శబరి ఉత్సవం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామయ్య సన్నిధిలో ఏటా వైభవంగా జరిగే శబరి స్మృతియాత్ర ఈ ఏడాది నిరాడంబరంగా జరిగింది. కరోనా వల్ల ఆలయ అర్చకులు ఎలాంటి హడావుడి లేకుండా నిర్వహించారు. గిరిజనులు ఉత్సవంలో పాల్గొని అడవి పూలు, పండ్లు స్వామివారికి సమర్పించారు.
భద్రాద్రిలో నిరాడంబరంగా శబరి స్మృతియాత్ర
ఈ ఏడాది కరోనా వల్ల నిబంధనలు పాటిస్తూ ఎలాంటి సందడి లేకుండా నిర్వహించారు. ఆలయం వద్ద నుంచి శబరిమాత చిత్రపటాన్ని తీసుకొచ్చి చిత్రకూట మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం చుట్టూ గిరి ప్రదర్శన నిర్వహించి భక్త రామదాసు, దమ్మక్క విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవంలో గిరిజనులు అడవి పూలు, పండ్లను స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు.
ఇదీ చూడండి:సన్న వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి: రైతు సంఘం
Last Updated : Oct 31, 2020, 1:47 PM IST