భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఆర్టీసీ డిపోలో చిట్టిబాబు అనే వ్యక్తి పదేళ్లు నుంచి ఒప్పంద కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. మూడు నెలల నుంచి వేతనాలు అందక ఇబ్బంది పడుతున్న చిట్టిబాబు మనోవేదనకు గురై డిపోలోనే బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో అతని గొంతుపై మూడు గాట్లు పడ్డాయి.
మణుగూరులో ఆర్టీసీ ఒప్పంద కార్మికుని ఆత్మహత్యాయత్నం - rtc contract labor suicide in manuguru
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఆర్టీసీ డిపోలో ఒప్పంద కార్మికుడిగా విధులు నిర్వహించే చిట్టిబాబు బ్లేడుతో గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. మూణ్నెళ్ల నుంచి వేతనం అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడమే కారణమని తెలిపాడు.
మణుగూరులో ఆర్టీసీ ఒప్పంద కార్మికుని ఆత్మహత్యాయత్నం
అక్కడ పనిచేసే తోటి కార్మికులు వెంటనే అతణ్నిప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళారు. చికిత్స అందించిన వైద్యులు అతనికి ప్రాణాపాయం లేదని తెలిపారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, కార్మికుల వేధింపులతోనే చిట్టిబాబు ఆత్మహత్యకు ప్రయత్నించాడని తోటి ఒప్పంద కార్మికులు ఆరోపించారు.
- ఇదీ చదవండి:'ఇండియా పేరు మార్పుపై ఆదేశాలివ్వలేం'