తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రాద్రిలో భారీగా గంజాయి పట్టివేత.. నలుగురు అరెస్టు - భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత

rs-95-lakh-60-thousand-worth-of-cannabis-seized-in-bhadrachalam
భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత

By

Published : Aug 25, 2020, 5:40 PM IST

Updated : Aug 25, 2020, 7:54 PM IST

17:38 August 25

భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత

భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత

భద్రాచలంలోని అంబేడ్కర్ సెంటర్​లో సీఐ వినోద్ రెడ్డి, ఎసై మహేష్ తనిఖీలు నిర్వహిస్తుండగా భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు. ఒక కారు, వ్యాన్​ల​లో 637 కిలోల గంజాయిని... తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.95.60 లక్షలు ఉంటుందని భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.  

గంజాయి రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశామని... వారిలో ఇద్దరు రాజస్థాన్​కు, మరో ఇద్దరు హర్యానాకు చెందిన వారిగా గుర్తించామని వెల్లడించారు. వారి నుంచి కారు, వ్యాన్, గంజాయిని స్వాధీనం చేసుకుని... కోర్టులో హాజరుపరిచామని ఏఎస్పీ తెలిపారు. 

Last Updated : Aug 25, 2020, 7:54 PM IST

ABOUT THE AUTHOR

...view details