తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన... వృద్ధురాలికి దొరికిన ఆశ్రయం - annam foundation

'నడి రోడ్డే ఆవాసం... చీర గుడిసే నివాసం...' అనే శీర్షికతో ఈటీవీ భారత్ ప్రసారం చేసిన​ కథనానికి 'అన్నం ఫౌండేషన్' ​ అనే స్వచ్ఛంద సంస్థ  స్పందించింది. ఆ వృద్ధురాలిని చేరదీసి అక్కున చేర్చుకున్నారు సంస్థ ప్రతినిధులు.

response to etv bharat news at bhadradri kothagudem district
ఈటీవీ భారత్​ కథనానికి స్పందన

By

Published : Dec 25, 2019, 9:53 PM IST

'నడిరోడ్డే ఆవాసం... చీర గుడిసే నివాసం...' అని ఈటీవీ భారత్​లో వచ్చిన ఓ దీనురాలి గాథను చూసిన అన్నం ఫౌండేషన్​ అనే స్వచ్ఛంద సంస్థ స్పందించింది. పదేళ్లుగా వృద్ధురాలు నివాసం ఉంటున్న గుడిసెను పోలీసుల సమక్షంలో తొలగించి ఆమెను తమతో తీసుకెళ్లారు. ఈ అవ్వతో పాటు మరో నలుగురు మానసిక వికలాంగులను చేరదీసింది ఈ సంస్థ. అన్నం ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ అన్నం శ్రీనివాసరావు గత 30 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటువంటి వారందరినీ గుర్తించి వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు. వారి ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత చిరునామాలు తెలుసుకొని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఇప్పటికే 280 మంది చేరదీయగా... అనేక అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. మానవసేవే మాధవసేవ అనే నానుడిని నిజం చేస్తున్నందుకు పలువురు అన్నం శ్రీనివాసరావును అభినందిస్తున్నారు.

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన

ABOUT THE AUTHOR

...view details