లాక్ డౌన్ వల్ల సుమారు నెలన్నర రోజులగా భక్తుల దర్శనాలు అనుమతి లేకుండా మూసివేసిన భద్రాద్రి ఆలయం... 46 రోజుల తర్వాత మళ్లీ తెరుచుకుంది. రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు ఎత్తివేయడంతో... ఉదయం నుంచి భద్రాద్రి ఆలయంలో దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 4 గంటలకు ఆలయ తలుపులు తెరిచి సుప్రభాత సేవ నిర్వహించారు.
భద్రాద్రి ఆలయంలో భక్తులకు దర్శనాలు పునః ప్రారంభం - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాజా వార్తలు
లాక్ డౌన్ ఎత్తివేయడంతో 46 రోజుల తర్వాత భద్రాద్రి ఆలయంలో భక్తులకు దర్శనాలు పునః ప్రారంభమయ్యాయి. లక్ష్మణ సమేత సీతారాములకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో భక్తులు తక్కువ సంఖ్యలో వచ్చారు.
![భద్రాద్రి ఆలయంలో భక్తులకు దర్శనాలు పునః ప్రారంభం reopen for devotees resumed at the Bhadradri temple 46 days after the lock-down was lifted.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12197701-478-12197701-1624160890573.jpg)
అనంతరం ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. తదుపరి బంగారు పుష్పాలతో అర్చన చేశారు. ఈరోజు నుంచి నిత్య కల్యాణాలు పునః ప్రారంభించారు. ఆలయం తెరుస్తున్నట్లు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో చాలా తక్కువ సంఖ్యలో భక్తులు ఆలయ దర్శనానికి వచ్చారు. ఉదయం నిర్వహించిన అభిషేకంలో భక్తులెవరు పాల్గొనలేదు. ఇంకా ఆలయ ప్రదేశాలన్ని నిర్మానుష్యంగానే దర్శనమిస్తున్నాయి. ఆలయం తెరుస్తున్నట్లు సమాచారం ఇవ్వకపోవడం వల్లే భక్తులు దర్శనాలకు రాలేదని స్థానికులు అంటున్నారు.
ఇదీ చూడండి: Father's Day :నీ ప్రతిరూపం నేను.. నా ప్రతి అడుగులో నువ్వు