క్రీడలతోనే యువతకు మంచి భవిష్యత్ ఉంటుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏఎస్పీ శబరీశ్ అన్నారు. యువతకు యుక్త వయసు చాలా కీలకమైందని ఆయన తెలిపారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మండలస్థాయి వాలీబాల్ పోటీలను ఏఎస్పీ ప్రారంభించారు.
'ఆటల్లో ప్రతిభ ప్రదర్శిస్తేనే యువతకు గుర్తింపు' - వాలీబాల్ పోటీలను ప్రారంభించిన మణుగూరు ఏఎస్పీ
యువత ఆటల్లో ప్రతిభ కనబరిస్తే మంచి గుర్తింపు లభిస్తుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏఎస్పీ శబరీశ్ తెలిపారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్విహించిన వాలీబాల్ పోటీలను ఆయన ప్రారంభించారు.
'ఆటల్లో ప్రతిభ ప్రదర్శిస్తేనే యువతకు గుర్తింపు'
పోలీసులకు, ప్రజలకు మధ్య దూరాన్ని తగ్గించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. పౌరులతో పోలీసుశాఖ ఎల్లప్పుడు స్నేహభావాన్ని కోరుకుంటుందని పేర్కొన్నారు. క్రీడల వల్ల మానసికంగా ధృడంగా తయారవుతారని, వ్యసనాలకు లోను కాకుండా ఉంటారని తెలిపారు. యువకులు క్రమశిక్షణ పాటిస్తూ ఎంచుకున్న లక్ష్యాలను చేరుకోవాలని ఏఎస్పీ శబరీశ్ సూచించారు.