భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తహసీల్దార్ కార్యాలయం వద్ద తెల్లరేషన్ కార్డుదారులు ఆందోళనకు దిగారు. లాక్డౌన్లో ప్రభుత్వం అందిస్తోన్న నగదు పోస్టాఫీస్ ద్వారా తమకు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇల్లందులో రేషన్‌కార్డుదారుల ఆందోళన - rationcard holders protest in yellandu
నగదు తమ ఖాతాలో పడలేదని బాధితులు ఆందోళనకు దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రేషన్‌కార్డుదారులు నిరసన చేపట్టారు.
ఇల్లందులో రేషన్‌కార్డుదారుల ఆందోళన
పట్టణంలోని 19వ వార్డులో మొదటి విడత నగదు కొందరికి వచ్చినట్లు సమాచారం వచ్చినా... బ్యాంక్‌లో, పోస్టాఫీస్‌లో నగదు అందలేదని నిరసన చేశారు. రెండో నెలలోనూ రాకపోవడం వల్ల ఆందోళనకు దిగినట్లు తెలిపారు.