Bhadradri Ramayya: భద్రాచలంలోని రామయ్య సన్నిధిలో... శ్రీరాముని జన్మ నక్షత్రం సందర్భంగా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా లక్ష్మణ సమేత సీతారాముల మూలవరులకు... విశేష స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం మాల ధరించిన రామభక్తులు... శ్రీరామ పాదుకలతో గిరి ప్రదక్షిణ, ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు. భద్రుని ఆలయంలో ఇరుముడులు సమర్పించిన శ్రీరామ మాలధారులు... విభిన్న వేషాధారణతో... స్వామివారి రథోత్సవంలో పాల్గొన్నారు. రథంలో తిరువీధుల్లో విహరించిన సీతారాములకు... భక్తులు ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. ఇవాళ భద్రాద్రి రామయ్యకు పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు.
Bhadradri Ramayya: ఘనంగా భద్రాద్రి రామయ్య రథోత్సవ వేడుక - Bhadradri Ramayya Rathotsavam
Bhadradri Ramayya: భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ రాముని జన్మ నక్షత్రం సందర్భంగా శ్రీరాముని జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాముల మూలవరులకు విశేష స్నపన తిరుమంజనం నిర్వహించారు.
Bhadradri