భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. ముందుగా ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు నూతన వస్త్రాలను అలంకరించారు.
భద్రాచలంలో వైభవంగా రథసప్తమి వేడుకలు - భద్రాచలం తాజా వార్త
రథసప్తమని పురస్కరించి భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. లక్ష్మణ సమేత సీతారాములను వెండి రథంలో ప్రధాన ఆలయం చుట్టూ ఊరేగించారు.
![భద్రాచలంలో వైభవంగా రథసప్తమి వేడుకలు ratha saptami celebrations in bhadrachalam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5929094-227-5929094-1580621608777.jpg)
భద్రాచలంలో వైభవంగా రథసప్తమి వేడుకలు
అనంతరం వెండి రథంలో సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి దీపదూప నైవేథ్యం సమర్పించి.. ప్రధాన ఆలయం చుట్టూ ఊరేగించారు. రథోత్సవ కార్యక్రంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రామనామ స్మరణ చేశారు.
భద్రాచలంలో వైభవంగా రథసప్తమి వేడుకలు