భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో రాపత్తు ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఆఖరు రోజు భద్రాద్రి రామయ్య పరవాస అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు స్వామి వారిని చిత్రకూట మండపం వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జీయర్ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవానికి.. ముఖ్య అతిథులుగా శ్రీ త్రిదండి దేవనాధ్ రామానుజ జీయర్ స్వామి హాజరయ్యారు.
భద్రాచలంలో ముగిసిన రాపత్తు ఉత్సవాలు - భద్రాచలంలో ఉత్సవాలు
భద్రాచలంలో రాపత్తు ఉత్సవాలు ముగిశాయి. ఉత్సవానికి ముఖ్య అతిథులుగా శ్రీ త్రిదండి దేవనాధ్ రామానుజ జీయర్ స్వామి పాల్గొన్నారు.
భద్రాచలంలో ముగిసిన రాపత్తు ఉత్సవాలు
గత సంవత్సరం డిసెంబర్ 15న శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలతో మొదలైన వేడుకలు 10రోజులపాటు కన్నుల పండువగా జరిగాయి. ఆ తర్వాత మొదలైన రాపత్తు ఉత్సవాలు నిన్నటితో ముగిశాయి. కాగా నేటి నుంచి స్వామివారికి విలాస ఉత్సవాలను నిర్వహించనున్నారు.