భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో గతంలోకంటే భిన్నంగా రంజాన్ వేడుకలను జరుపుకున్నారు. గతంలో వందలాది మంది పట్టణంలోని ఈద్గా వద్ద ప్రార్థనలు చేసేవారు. కరోనా కారణంగా ఈ సారి ప్రభుత్వ నిబంధనల మేరకు ఇంట్లోనే రంజాన్ పర్వదిన్నాన్ని జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు చేశారు.
ఇల్లందులో నిరాడంబరంగా రంజాన్ వేడుకలు - ఇల్లందులో నిరాడంబరంగా రంజాన్ వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కరోనా కారణంగా రంజాన్ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. ముస్లింలంతా పట్టణంలోని తమ పెద్దల సమాధుల వద్ద పుష్పగుచ్ఛాలు పెట్టి, పూలు చల్లి ఆనవాయితీ ప్రారం ప్రార్థనలు చేశారు.
ఇల్లందులో నిరాడంబరంగా రంజాన్ వేడుకలు
పట్టణంలోని తమ పెద్దల సమాధుల వద్ద పుష్పగుచ్ఛాలు పెట్టి, పూలు చల్లి ఆనవాయితీ ప్రాకారం ప్రార్థనలు చేశారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని పేదలకు కొందరు ముస్లిం మత పెద్దలు సహాయం చేశారు.
ఇవీ చూడండి:గొర్రెకుంట బావి ఘటనలో వీడిన మిస్టరీ.. ప్రేమ వ్యవహారమే కారణమా?