భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ భగవత్ రామానుజ చార్య జయంతి వేడుకలు కన్నులపండువగా జరిగాయి. ఉపాలయంలో వేంచేసి ఉన్న రామానుజుల వారికి ఉదయం ఆలయ అర్చకులు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం కావడంతో ప్రధానాలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు స్నపన తిరుమంజనం నిర్వహించి బంగారు పుష్పాలతో అర్చన చేశారు.
భద్రాద్రిలో వైభవంగా రామానుజ చార్య జయంతి వేడుకలు - Ramanuja Charya Jayanti celebrations in Bhadradri temple
భద్రాద్రి సన్నిధిలో శ్రీ భగవత్ రామానుజ చార్య జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. రామానుజుల వారికి ఆలయ అర్చకులు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.
శ్రీ భగవత్ రామానుజ చార్య జయంతి
ఈ రోజు సాయంత్రం రామానుజాచార్యుల మందిరం చుట్టూ సేవ ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు.
ఇదీ చదవండి:భద్రాద్రి రామయ్య కల్యాణానికి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలు