భద్రాద్రి ఆలయ నిర్మాత, వాగ్గేయకారుడు భక్త రామదాసు జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రామదాసు చిత్రపటంతో నగర సంకీర్తన నిర్వహించారు. నూతన వస్త్రాలు సమర్పించి ప్రసాదం పంపిణీ చేశారు. ఆలయంలో సంగీత విద్వాంసులతో వాగ్గేయకారోత్సవాలు నిర్వహిస్తున్నారు.
భద్రాద్రిలో వైభవంగా రామదాసు జయంతి ఉత్సవాలు - తెలంగాణ భక్తి వార్తలు
భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ భక్తరామదాసు జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రామదాసు చిత్రపటంతో నగర సంకీర్తన నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రదక్షిణ చేసి భక్తరామదాసు విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు.
భద్రాద్రిలో వైభవంగా రామదాసు జయంతి ఉత్సవాలు
రామదాసు జన్మస్థలం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోనూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. భక్త రామదాసు పదోతరం వారసుడు కంచర్ల శ్రీనివాస్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు.