భద్రాద్రి శ్రీసీతారాముల కల్యాణానికి ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన భక్తులు గోటి తలంబ్రాలు సమర్పించారు. రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లోని సుమారు యాభై మండలాలకు చెందిన భక్తులు సమర్పించిన గోటి తలంబ్రాలను రామయ్య సన్నిధిలో అందించారు.
రామయ్యకు గోటి తలంబ్రాలు సమర్పించిన ఏపీకి చెందిన భక్తులు - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వార్తలు
భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఈ నెల 21న జరగనున్న సీతారాముల కల్యాణం సందర్భంగా ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన భక్తులు గోటి తలంబ్రాలను సమర్పించారు. అన్నదానం నిమిత్తం 50 కిలోల బియ్యం, బంగారు ఆభరణాలు స్వామివారి ఆలయంలో అందించారు.
ramayya
గత ఐదేళ్ల నుంచి స్వామివారికి... రాజమహేంద్రవరానికి చెందిన శ్రీనివాస్, దేవి దంపతులు గోటి తలంబ్రాలు సమర్పిస్తున్నారు. ఈ ఏడాది తలంబ్రాలతో పాటు, అన్నదానం నిమిత్తం 50 కిలోల బియ్యం, రూ.60వేలు విలువైన బంగారు ఆభరణం స్వామివారికి సమర్పించారు.
ఇదీ చూడండి:రామయ్య సన్నిధిలో ధ్వజారోహణ ఉత్సవం