భద్రాద్రి కొత్తగూడెంలో శుక్రవారంఓ వివాహానికి పెళ్లికుమారుడు తరఫువారు వధువు ఇంటికొచ్చారు. పెళ్లి విందులో కోడిమాంసం పెట్టారు. తమకు మటన్ కర్రీ కావాలని పెళ్లికొడుకు బంధువులు డిమాండ్ చేశారు. మటన్ కర్రీ వడ్డించేంత ఆర్థిక స్తోమత తమకు లేదన్నారు వధువు తరఫువారు. అంతే.. ఆగ్రహంతో ఊగిపోయిన వరుడు బంధువులు వాగ్వాదానికి దిగారు. మాటా మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది.
కర్రలు, కుర్చీలతో కొట్టుకున్నారు
మీరెంతంటే మీరెంత అంటూ ఇరువర్గాలు ఏమాత్రం తగ్గలేదు. కుర్చీలు, కర్రలతో రక్తాలు కారేలా కొట్టుకున్నారు. కొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సిన మండపం విరిగిన కుర్చీలు. చిరిగిన టెంటులు, దెబ్బలు తిన్నవారి ఆర్తనాదాలతో నిండిపోయింది. శుక్రవారం జరిగిన ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
మటన్ కోసం కొట్లాట - మటన్ కోసం కొట్లాట
కట్నకానుకలు తక్కువయ్యాయనో..పెళ్లి కుమారుడు/కుమార్తె నచ్చలేదనో పెళ్లిలో గొడవలు కావడం కామన్. కానీ పెళ్లి విందులో మేక మాంసం పెట్టలేదని చితక్కొట్టుకున్నారు.
మటన్ కర్రీ కోసం కొట్లాట
ఇవీ చదవండి:'ప్రాణం తీసిన కోడిమాంసం'
Last Updated : Feb 26, 2019, 12:06 PM IST