తెలంగాణ

telangana

ETV Bharat / state

దేశానికి పీవీ సంస్కరణలే దిశా నిర్దేశం: కలెక్టర్ ఎంవీ రెడ్డి - భద్రాద్రి కలెక్టరేట్​లో పీవీ జయంతి

కొత్తగూడెం కలెక్టరేట్​లో పాలనాధికారి ఎంవీ రెడ్డి.. పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

pv centenary celebrations in bhadradri collectorate
'పీవీ సంస్కరణలు దేశాన్ని కాపాడాయి'

By

Published : Jun 28, 2020, 4:24 PM IST

ప్రధానిగా పీవీ నరసింహా రావు చేసిన సంస్కరణలు దేశాన్ని విపత్కర పరిస్థితుల నుంచి కాపాడాయన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి. కలెక్టరేట్​లో పీవీ చిత్రపటానికి కలెక్టర్​, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీవీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి... దేశాన్ని అభివృద్ధి పథం వైపునకు నడిపించడం తెలుగు జాతి గర్వించదగ్గ విషయమని పాలనాధికారి ఎంవీ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ ఛైర్​పర్సన్ సీతాలక్ష్మి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details