భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని పలు గ్రామాల్లో హైదరాబాద్‌కు చెందిన ప్యూర్ స్వచ్ఛంద సంస్థ, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఎల్లాపురం, మర్రిగూడెం, ఎడిపలగూడెం, పోలరం, బొంబాయి తండా, రాళ్ల గుంపు వంటి కొవిడ్ ప్రభావిత గ్రామాల్లో బ్రెడ్, పాలు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు.
ఆపత్కాలంలో ఆదుకుంటున్న స్వచ్ఛంద సంస్థలు - ప్యూర్ స్వచ్ఛంద సంస్థ
కరోనా మహమ్మారితో కుటుంబాలన్నీ చిన్నాభిన్నం అయ్యాయి. కుటుంబ పెద్దను కోల్పోయి ఉపాధి కరవై... రోడ్డున పడుతున్నారు. కూడు, గూడు లేక నిరుపేదలు పస్తులుంటున్నారు. ఆపత్కాలంలో ఆకలితో అలమటిస్తున్న అన్నార్థుల కడుపు నింపడానికి... కొందరు దాతలు ముందుకు వస్తున్నారు. ఆహారం, మందులు, ఆక్సిజన్ అందిస్తూ కష్టకాలంలో అండగా నిలుస్తున్నారు.
ఆపత్కాలంలో ఆదుకుంటున్న స్వచ్ఛంద సంస్థలు
హైదరాబాద్ నుంచి వచ్చిన వైద్యులు సురేంద్రనాథ్, చైతన్య ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. వైద్య పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. కరోనా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఇదీ చూడండి:కొవిడ్‌తో తల్లిదండ్రుల మృత్యువాత.. దిక్కుతోచని స్థితిలో పిల్లలు