తెలంగాణ

telangana

ETV Bharat / state

పునర్వసు నక్షత్రం సందర్భంగా రామయ్యకు ప్రత్యేక పూజలు - punarvasu-pujalu-at-bhadrachalam

పునర్వసు నక్షత్రం పురస్కరించుకుని భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పునర్వసు నక్షత్రం సందర్భంగా రామయ్యకు ప్రత్యేక పూజలు

By

Published : Sep 24, 2019, 1:10 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే స్వామివారికి ప్రాకార మండపంలో పంచామృతాలతో, పుష్పాలతో అభిషేకం చేశారు. పునర్వసు నక్షత్రం సందర్భంగా మహిళలు ప్రత్యేక కీర్తనలు ఆలపించారు. సాయంత్రం గోదావరి నది ఒడ్డున గల పునర్వసు మండపం వద్ద లక్ష్మణ సమేత సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

పునర్వసు నక్షత్రం సందర్భంగా రామయ్యకు ప్రత్యేక పూజలు

ABOUT THE AUTHOR

...view details