భద్రాద్రి రామయ్య సన్నిధిలో రథోత్సవం ఘనంగా జరిగింది. చిత్రకూట మండపంలో స్వామివారి ఎదుట ఇరుముడికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామయ్య పాదుకలను ఆలయ ఈవో రమేశ్‌బాబు తలపై పెట్టుకుని గిరిప్రదక్షిణ చేశారు. అనంతరం ఆలయంలో మాల విరమణ ఉత్సవం జరిపారు. శ్రీరామ దీక్ష చేపట్టిన వారు పునర్వసు నక్షత్రం సందర్భంగా తమ దీక్ష విరమించారు.
భద్రాద్రిలో పునర్వసు నక్షత్రోత్సవం - భద్రాచలం
భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీరామ పునర్వసు దీక్షా విరమణ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఇరుముళ్లు సమర్పించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
భద్రాద్రిలో పునర్వసు నక్షత్రోత్సవం