భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని ఇందిరానగర్లో గత సంవత్సరం 5 లక్షల 15 వేల రూపాయలు పెట్టి ఆరిఫా మోహినుద్దీన్ దంపతులు... అప్సర బేగం అనే మహిళకు చెందిన 3 పోర్షన్ల ఇంటిలో ఒక పోర్షన్ని గత సంవత్సరం జులై నెలలో కొనుగోలు చేశారు.
కాగా ఇళ్లు అప్పగించేందుకు కొంత సమయం కావాలని ఇంటి యజమాని అడిగింది. కాగా ఆమె చెప్పిన విధంగానే సమయం ఇవ్వగా మరికొంత సమయం అంటూ నెలల తరబడి.. ఇల్లు అప్పగించకుండా కాలయాపన చేస్తూ ఉండడం వల్ల గతంలో మనస్థాపానికి గురైన ఆరిఫా ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. ఇల్లు కొనుగోలు చేసినప్పుడు పూర్తి ఆధారాలు, ఫోటోలు, వీడియోలు ఉన్నప్పటికీ తమకు ఇల్లు అప్పగించకుండా ఎక్కడైనా చెప్పుకో అంటూ బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.