తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఏడాది నిషేధం.. నిర్బంధ చర్యలను తలపిస్తోంది'

ప్రజా సంఘాలపై ప్రభుత్వం నిషేధం విధించడం పట్ల సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నిరసన వ్యక్తం చేసింది. ఆటపాటలు, రాతలపై నిర్బంధాలను ఖండిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ప్లకార్డులను ప్రదర్శించారు. నిషేధం ఎత్తివేయాలని డిమాండ్​ చేశారు.

cpi ml new democracy, yellandu, badradri kothagudem
cpi ml new democracy, yellandu, badradri kothagudem

By

Published : Apr 25, 2021, 4:26 PM IST

ప్రజా సంఘాలపై నిషేధం ఎత్తివేయాలంటూ సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులు ప్రదర్శించారు.

విరసంతోపాటు 16 సంఘాలను ఏడాది పాటు నిషేధించటం.. నిర్బంధ చర్యలను తలపిస్తోందని రాష్ట్ర నాయకురాలు చండ్ర అరుణ అన్నారు. రాష్ట్ర సాధనలో సబ్బండ వర్గాలు పాల్గొని.. ఆందోళన చేస్తేనే రాష్ట్రం సిద్ధించిందని గుర్తు చేశారు. కవులు, కళాకారులు, అన్ని రంగాల ప్రజలు జేఏసీగా ఏర్పడి ఉద్యమం ఉద్ధృతం చేస్తేనే తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని దుయ్యబట్టారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూస్తున్నాయని.. నిర్బంధాలు కొనసాగిస్తే ఉద్యమాలు ఉవ్వెత్తున లేస్తాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీతో పాటు, పీవైఎల్, పీఓడబ్ల్యూ, ఐఎఫ్​టీ నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:కరోనా రెండో దశ తుపానులా విస్తరిస్తోంది: మోదీ

ABOUT THE AUTHOR

...view details