భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఖమ్మం, వరగంల్, నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఇల్లందులో తెజస, సీపీఐ(ఎంఎల్), న్యూ డెమోక్రసీ తదితర పార్టీల సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఓటెయ్యండి: కోదండరాం - kodandram election campaigning at illandu
ఖమ్మం, వరగంల్, నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల ప్రచారాన్ని ప్రొఫెసర్ కోదండరాం ఇల్లందులో చేపట్టారు. ఎన్నికల్లో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగుతామని ఆయన వివరించారు.
![నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఓటెయ్యండి: కోదండరాం election campaigning in bhadradri district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9268024-22-9268024-1603346984010.jpg)
పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కోదండరాం
ఎన్నికల నేపథ్యంలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కుదిరితే ఐక్యంగా లేకపోతే ప్రొఫెసర్ జయశంకర్ చెప్పినట్లు సమాంతరంగా సాగుతామని తెలిపారు. తెలంగాణ వనరులు, ఖనిజాలు, యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పన దొరకాలని కోదండరాం ఆకాంక్షించారు.
ఇదీ చదవండిఃమహబూబాబాద్‌లో అపహరణకు గురైన బాలుడు హత్య