తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఖాళీ స్థలానికి రుసుం చెల్లించాలనడం ఏమిటీ' - badradhri kothagudem land issue latest News

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పిచ్చి మొక్కలు పెరిగిన స్థలాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పురపాలక అధికారులు భూమిని చదునుచేశారు. ఇదేమిటని అడిగిన బాధితుడ్ని రుసుం చెల్లించాలని అధికారులు చెప్పడం పట్ల బాధితుడు ఆందోళన వ్యక్తం చేశారు.

పట్టణ ప్రగతితో బాధితుడికి తిప్పలు.. రుసుం చెల్లించాలంటున్న బల్దియా
పట్టణ ప్రగతితో బాధితుడికి తిప్పలు.. రుసుం చెల్లించాలంటున్న బల్దియా

By

Published : Sep 20, 2020, 12:56 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం 16వ వార్డులో 8 ఏళ్ల క్రితం దశరథ్ ఇల్లు కూలిపోవడంతో మరో ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. తన సొంత స్థలంలో రేకుల షెడ్ వేసుకుందామని వచ్చిన దశరథ్​కు చుక్కెదురైంది. పురపాలిక ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సదరు స్థలాన్నిపుర సిబ్బంది చదును చేశారు. ఫలితంగా పురపాలక సంఘానికి రుసుం చెల్లించాల్సి నివాస స్థల యజమానికి అధికారులు నోటీసులు పంపించారు.

యజమానికి నోటీసులు..

మార్చి 4న, జూన్ 6న దశరథ్ పేరిట రెండు నోటీసులు ఉన్నాయి. అందులో గతంలో పనిచేసిన కమిషనర్ సంతకంతో ఒక నోటీస్, ప్రస్తుత కమిషనర్ సంతకంతో మరో నోటీస్ జారీ చేసినట్లుగా ఉండటం కొసమెరుపు.

నా వద్దకు ఎవరూ రాలేదు : కమిషనర్

తన వద్దకు సమస్య ఉందంటూ ఏ బాధితుడు రాలేదని పుర కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. సమస్యను బాధితుడు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన క్రమంలో ఫిర్యాదు కలెక్టర్ దృష్టికి వెళ్లిందన్నారు. ఫలితంగా కలెక్టర్ ఆదేశాల మేరకు తాను బాధితుడి స్థల పరిశీలనకు వెళ్లినట్లు ఆయన స్పష్టం చేశారు.

'నోటీస్​పై గత కమిషనర్​ సంతకం ఏమిటి ?'

పట్టణ ప్రగతిలో భాగంగా జరిగిన కార్యక్రమాలకు ఖాళీ స్థలాల యజమానులు సైతం పురపాలక సంఘానికి డబ్బులు చెల్లించాలా ? చెల్లిస్తే ఎంతమేర చెల్లించాలి ? అన్న ప్రశ్నలకు అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉందని బాధితుడు తెలిపారు. తనకు జారీ చేసిన రెండో నోటీసు అనుమానస్పదంగా ఉందన్నారు. నోటీస్​పై ఎటువంటి సంఖ్య లేకపోవడం, స్థలం తన తల్లి పేరు మీద ఉన్నప్పటికీ తన పేరు మీద నోటీస్ ఎలా ఇచ్చారో అధికారులు జవాబు చెప్పాలని బాధితుడు ప్రశ్నించారు.

జూన్ 6న ఇచ్చిన నోటీసులో ప్రస్తుత కమిషనర్​ సంతకం కాకుండా గత కమిషనర్ సంతకం ఉండటం మరిన్ని అనుమానాలు రేకేత్తిస్తోందన్నారు. వెంటనే తనకు న్యాయం చేయాలని బాధితుడు జిల్లా కలెక్టర్​ను కోరారు.

ఇవీ చూడండి : భగ్గుమంటున్న ధరలు.. సామాన్యునికి కూర'గాయాలు'

ABOUT THE AUTHOR

...view details