భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తిమ్మంపేటలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఎకరన్నర విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన వనంలో 6వేల మొక్కలు నాటారు. దానిచుట్టూ ఇనుప కంచెను ఏర్పాటు చేశారు.
తిమ్మంపేటలో ప్రకృతి వనాన్ని ధ్వంసం చేసిన దుండగులు.. - prakruthi vanam is destroyed in thimmampeta
పల్లె ప్రకృతి వనాల ఏర్పాటును తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. దీనికోసం పంచాయతీలకు రూ.30 లక్షలకుపైనే నిధులను కేటాయించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తిమ్మంపేటలోని ప్రకృతి వనాన్ని కొందరు దుండగులను ధ్వంసం చేశారు.
తిమ్మంపేటలో ప్రకృతి వనాన్ని ధ్వంసం చేసిన దుండగులు..
ప్రకృతి వనంలో నాటిన 6వేల మొక్కలతోపాటు కంచెను కూడా దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయంపై గ్రామ సర్పంచ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాన్ని ధ్వంసం చేయడం చర్చనీయాంశమైంది.