తెలంగాణ

telangana

ETV Bharat / state

దమ్ముంటే నన్ను బీఆర్​ఎస్​ నుంచి సస్పెండ్‌ చేయాలి: పొంగులేటి - former mp ponguleti srinivas reddy latest news

ఇటీవల వరుసగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ.. బీఆర్​ఎస్​పై విరుచుకుపడుతున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి మరోసారి కేసీఆర్​ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. గడిచిన తొమ్మిదేళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం పేదలకు ఏం చేసిందని ప్రశ్నించారు. తన కార్యకర్తలను పార్టీ నుంచి సస్పెండ్​ చేయడం కాదని.. దమ్ముంటే తనను సస్పెండ్​ చేయాలని సవాల్​ చేశారు.

ponguleti
ponguleti

By

Published : Feb 6, 2023, 10:14 PM IST

దమ్ముంటే తనను బీఆర్​ఎస్​ నుంచి సస్పెండ్‌ చేయాలని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం పేదలకు ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేటలో అశ్వారావుపేట నియోజకవర్గ కార్యకర్తలతో ఇవాళ ఆయన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన బీఆర్​ఎస్​ సభకు జనాన్ని ఎలా తరలించారో అందరికీ తెలుసన్నారు. కార్యకర్తల అభీష్ఠం మేరకు ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకుంటానని చెప్పారు. తన కార్యకర్తలను ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు.

''గడిచిన 9 ఏళ్లలో కేసీఆర్​ ప్రభుత్వం పేదలకు ఏం చేసింది. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన బీఆర్​ఎస్​ సభకు జనాన్ని ఎలా తరలించారో అందరికీ తెలుసు. దమ్ముంటే తనను బీఆర్​ఎస్​ నుంచి సస్పెండ్‌ చేయాలి. నా కార్యకర్తలను ఇబ్బంది పెడితే సహించేది లేదు. కార్యకర్తల అభీష్ఠం మేరకు ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకుంటా.'' - పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, మాజీ ఎంపీ

దమ్ముంటే నన్ను బీఆర్​ఎస్​ నుంచి సస్పెండ్‌ చేయాలి: పొంగులేటి

ఆదివారం ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి పొంగులేటితో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్​ఎస్​ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరైన సంగతి తెలిసిందే. అయితే.. బీఆర్​ఎస్​ అధినేతకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పొంగులేటి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారంటూ.. పలువురిపై పార్టీ ఆయా మండలాల నాయకులు బహిష్కరణ వేటు వేశారు. దాదాపు 20 మందిని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పొంగులేటి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

బహిష్కరణ వేటు..: ఖమ్మం జిల్లాలో పొంగులేటి అనుచరులపై బీఆర్​ఎస్ ఇటీవల​ బహిష్కరణ వేటు వేసింది. కొన్ని నెలలుగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి బీఆర్​ఎస్​పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే అప్పటి నుంచి అతను బీఆర్​ఎస్​కు దూరంగా ఉంటున్నారు. తాజాగా వైరా నియోజకవర్గానికి చెందిన పలువురు పార్టీ​ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయనను కలవడానికి వెళ్లారు. ఈ విషయం అధిష్ఠానానికి తెలియడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. క్రమశిక్షణ చర్యలకు పూనుకుంది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తిరుగుబావుటా ఎగురవేసిన పొంగులేటి వర్గంపై బీఆర్​ఎస్​ బహిష్కరణ అస్త్రం ప్రయోగించింది.

వైరా నియోజకవర్గంలో 20 మంది నాయకులపై బీఆర్​ఎస్​ చర్యలు తీసుకుంది. రాష్ట్ర మార్క్​ఫెడ్​ వైస్​ ఛైర్మన్​ బొర్రా రాజశేఖర్​ను బీఆర్​ఎస్​ నుంచి బహిష్కరించింది. వైరా పురపాలక ఛైర్మన్​ జైపాల్​తో పాటు 18 మందిని సస్పెండ్​ చేసింది. గత కొన్ని రోజులుగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి, బీఆర్​ఎస్​ అధిష్ఠానికి మధ్య పొసగడం లేదు. మండల స్థాయి నాయకులతో మంతనాలు సాగిస్తున్న పొంగులేటి.. పార్టీ నుంచి దూరంగా జరిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉదయం దాదాపు 5 మండలాల నేతలు పొంగులేటితో సమావేశమయ్యారు. పలువురు ముఖ్య నేతలు, బీఆర్​ఎస్​ ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొనడంపై అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పొంగులేటితో సమావేశమైన నేతలను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఆయా మండల పార్టీ అధ్యక్షులు ప్రకటించారు.

ఇవీ చూడండి..

పొంగులేటి రాజకీయ అడుగులపై సర్వత్రా ఆసక్తి

పొంగులేటికి ప్రభుత్వం ఝలక్.. ఆ వ్యాఖ్యలు చేయడం వల్లేనా?

ABOUT THE AUTHOR

...view details