తెలంగాణ

telangana

ETV Bharat / state

భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు అక్రమంగా పెద్ద ఎత్తున తరలిస్తున్న గంజాయిని భద్రాచలంలో పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ సూమారు రూ. 2 కోట్లు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు
భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు

By

Published : Sep 11, 2020, 7:18 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పోలీసులు భారీ ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 1,415 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్ కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక, విశాఖపట్నం, హైదరాబాద్ కు చెందిన ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.

2 వ్యాన్లతో సహా సుమారు రూ. 2 కోట్ల విలువ గల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు భద్రాచలం ఏఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సుమారు 20కి పైగా గంజాయి కేసులు నమోదైనట్లు తెలిపారు. అక్రమ తరలింపులకు పాల్పపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: నూతన రెవెన్యూ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details