భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మేడికుంట గ్రామంలో పోడు భూముల్లో కందకం పనులు చేయగా.. గతంలో రైతులనుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్న అటవీశాఖ అధికారులు ఈసారి వ్యూహం మార్చారు. తెల్లవారుజామున.. మేడికుంట గ్రామాన్ని దిగ్బంధం చేసి ఆరో విడత హరితహారం కోసం పన్నెండున్నర హెక్టార్ల భూములో కందకం పనులు ప్రారంభించారు. గ్రామంలో ఏం జరుగుతోందో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్న గ్రామస్థులు... కొద్దిసేపటికి పోడు భూముల్లో కందకం పనులు జరిపేందుకు ఆటవీ శాఖ అధికారులు వస్తున్నారనే విషయం అర్థమైంది.
కందకం పనుల్లో వ్యూహం మార్చిన అటవీశాఖ అధికారులు - police securityat illandu for haritharam works
గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మేడికుంట గ్రామంలో పోడు భూముల్లో కందకం పనులకు రైతులు తీవ్రంగా ప్రతిఘటించగా ఈసారి అధికారులు వ్యూహం మార్చారు. ముందుగా గ్రామస్థులను దిగ్బంధం చేసి హరితహారం కోసం కందకం పనులను ప్రారంభించారు.
కందకం పనుల్లో వ్యూహం మార్చిన అటవీశాఖ అధికారుల
ఈ ప్రక్రియ మొదట ప్రతిఘటించిన గ్రామస్థులతో అధికారులు చర్చలు సాగించారు. అడవుల ప్రాముఖ్యత, అటవీ చట్టాలపై అవగాహన కల్పించి 12.5 హెక్టార్ల భూమిని కందకం పనులు చేసుకునేలా ఒప్పించి సఫలీకృతులయ్యారు. పోడు రైతులతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండటాన్ని అధికారులు అభినందించారు.