భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఏకతా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. స్వాతంత్య్రం వచ్చాక ముక్కలు ముక్కలుగా ఉన్న దేశాన్ని ఒకే తాటిపైకి తీసుకురావడానికి సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారని సీఐ రమేష్ కొనియాడారు.
ఇల్లందులో ఏకతాదివస్ సంబురాల్లో భాగంగా పోలీసుల ర్యాలీ - police rally at illandu
సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏకతాదివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశం మొత్తాన్ని ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకు పటేల్ ఎంతో కృషి చేశారని ఇల్లందు సీఐ కొనియాడారు.

ఇల్లందులో ఏకతాదివస్ సంబురాల్లో భాగంగా పోలీసుల ర్యాలీ
వల్లభభాయ్ పటేల్ పుట్టినరోజును ఏకతా దివస్‌గా జరుపుకోవడం సంతోషకరమని సీఐ అన్నారు. దేశ సేవ కోసం ఎంతో కృషి చేసినందువల్లే పటేల్‌కు ఉక్కుమనిషి బిరుదు వరించిందని కొనియాడారు. కార్యక్రమంలో ఎస్సైలు కుమారస్వామి, శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.