తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో రేపు పంచాయతీ ఎన్నికలు.. భద్రాచలంలో వాహన తనిఖీలు - Bhadradri Kottagudem District Latest News

ఏపీలో పంచాయతీ ఎన్నికలు రేపు జరగనున్నందున భద్రాచలంలో వాహన తనిఖీలు చేపట్టారు. అక్రమ మద్యం, నగదు రవాణా జరగకుండా నిర్వహిస్తున్నారు. భద్రాచలంలో ఇప్పటికే వైన్స్​ షాపులు మూసివేశారు.

vehicle inspections in Bhadrachalam
భద్రాచలంలో వాహన తనిఖీలు

By

Published : Feb 16, 2021, 1:44 PM IST

ఆంధ్రప్రదేశ్​లో పంచాయతీ ఎన్నికలు రేపు జరగనున్నందున తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన భద్రాచలంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. రాష్ట్రం నుంచి ఏపీలోకి అక్రమ మద్యం, నగదు రవాణా జరగకుండా భద్రత కట్టుదిట్టం చేశారు.

పోలీసులు ప్రతీ వాహనాన్ని ఆపి తనిఖీలు చేస్తున్నారు. ఏపీలో ఎన్నికలు జరగనున్నందున భద్రాచలంలో ఇప్పటికే మద్యం దుకాణాలను మూసివేశారు.

ఇదీ చూడండి:మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానానికి కాంగ్రెస్ నామినేషన్

ABOUT THE AUTHOR

...view details