భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెం గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు పోలీస్ శాఖ వారు. మణుగూరు ఏఎస్పీ శబరీష్ మంగళవారం దీనిని ప్రారంభించారు. గత కొన్నేళ్లుగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ క్యాంప్ సేవలను సద్వినియోగం చేసుకొని ప్రజలు వైద్య చికిత్స పొందాలని ఆయన సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైద్య శిబిరాన్ని పరిశీలించిన ఏఎస్పీ రోగులకు మందులు పంపిణీ చేసి, వైద్యుల్ని సన్మానించారు.
గొందిగూడెంలో పోలీసు శాఖ మెగా హెల్త్ క్యాంప్ శిబిరం ప్రారంభం - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖ మెగా హెల్త్ క్యాంప్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెం గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మణుగూరు ఏఎస్పీ శభరీష్ మంగళవారం ప్రారంభించారు. ఈ శిబిరంలో వైద్యసేవలను వినియోగించుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు.

గొందిగూడెంలో పోలీసు శాఖ మెగా హెల్త్ క్యాంప్ శిబిరం ప్రారంభం
ఈ కార్యక్రమంలో సీఐ రాజు, వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: నమ్మితే నట్టేట మునిగినట్టే... ఆన్‌లైన్‌లో బహుమతులు, డిస్కౌంట్ల ఎర