నేటి నుంచి ఆగస్టు 3 వరకు ఏజెన్సీ గ్రామాల్లో వాడవాడలా మావోయిస్టు అమరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించాలని చర్ల శబరి కమిటీ కార్యదర్శి అరుణక్క, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాల డివిజన్ కార్యదర్శి ఆజాద్ పిలుపునిచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముమ్మరంగా తనిఖీలు - mavoists latest news
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు అమరుల సంస్మరణ వారోత్సవాలకు పిలుపునివ్వడం వల్ల పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానాస్పదంగా ఉన్నవారిని ప్రశ్నిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముమ్మరంగా తనిఖీలు
ఇందుకు సంబంధించి దుమ్ముగూడెం, చర్ల మండలాలతో పాటు సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ, బీజాపూర్ జిల్లాల్లో మావోయిస్టులు కరపత్రాలు విడుదల చేశారు. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానంగా కనిపించిన వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి :'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'