భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కొమురం పంచాయతీ పరిధిలోని దేశ్య తండా శివారులో 32 టన్నుల రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచారు. ముందస్తు సమాచారం మేరకు తహసీల్దార్ ముత్తయ్య , పోలీసులు దాడి చేశారు.
ఇల్లందులో 32 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత - police caught ration rice in bhadhradri
లాక్డౌన్ వల్ల ఉపాధి లేక ఏ ఒక్కరు ఆకలితో అలమటించకూడదని రాష్ట్ర ప్రభుత్వం బియ్యం అందిస్తోంది. కొందరు అక్రమార్కులు ఆ బియ్యం లబ్ధిదారులకు అందకుండా సొమ్ము చేసుకుంటున్నారు.
ఇల్లందులో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ
బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నిల్వ ఉంచిన వారి కోసం దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రవి కుమార్ తెలిపారు.