భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో 266 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భద్రాచలంలోని బ్రిడ్జి రోడ్డులో ఉన్న ఫారెస్ట్ చెక్పోస్ట్ సమీపంలో ఆగివున్న కారులో గంజాయిని పట్టుకున్నారు. చెక్పోస్ట్ వద్ద ఉన్న పోలీసులను చూసి నిందితులు కారులో గంజాయిని వదిలిపెట్టి పరారయ్యారు.
భద్రాద్రిలో 266 కేజీల గంజాయి పట్టివేత.. నిందితుల పరారీ - భారీగా గంజాయి పట్టివేత
భద్రాచలంలో ఓ కారులో భారీగా గంజాయి పట్టుబడింది. పోలీసులను చూసి నిందితులు కారును వదిలిపెట్టి పరారయ్యారు. 266 కేజీల గంజాయి పట్టుబడిందని పట్టణ ఎస్సై మహేశ్ తెలిపారు.
భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత
దీంతో కారుతోపాటు 266 కేజీల గంజాయిని పట్టణ ఎస్సై మహేశ్ స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ సుమారు 40 లక్షలు ఉంటుందని, నిందితుల కోసం ఆరా తీస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఇవీ చూడండి: బియ్యంలోడు లారీలో చెలరేగిన మంటలు.. పాక్షికంగా లారీ దగ్ధం