దుమ్ముగూడెం ప్రాజెక్టు వద్ద ఆందోళన చేపట్టేందుకు వెళ్తున్న వి.హనుమంత రావును కొత్తగూడెం పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వైఖరికి నిరసనగా హనుమంతరావు రోడ్డుపై బైఠాయించి ఆవేదన వ్యక్తం చేశారు.
వీహెచ్‌ను అడ్డుకున్న పోలీసులు.. రోడ్డుపై బైఠాయింపు - kothagudem latest news today
దుమ్ముగూడెం ప్రాజెక్టు వద్ద జల దీక్ష చేపట్టేందుకు వెళ్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావును కొత్తగూడెంలోని సింగరేణి విశ్రాంతి గృహం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడే రోడ్డుపై బైఠాయించి వర్షంలో నిరసన తెలిపారు.
![వీహెచ్‌ను అడ్డుకున్న పోలీసులు.. రోడ్డుపై బైఠాయింపు Police blocking the VH hanumantha rao at kothagudem](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7594497-800-7594497-1591996318861.jpg)
వీహెచ్‌ను అడ్డుకున్న పోలీసులు.. రోడ్డుపై బైఠాయింపు
వర్షం కురుస్తుండగా ఆ జల్లులోనే తన నిరసనను వ్యక్తం చేస్తూ రోడ్డుపై కూర్చున్నారు. తెరాస ప్రభుత్వం పోలీసులను ప్రలోభపెట్టి వారిని ఉపయోగించి తమ పబ్బం గడుపుకుందని హనుమంతరావు ఆరోపించారు. జల దీక్షకు అనుమతి లేకపోవడం వల్ల కాంగ్రెస్ నాయకులను పలుచోట్ల పోలీసులు ఆపుతున్నారు.
ఇదీ చూడండి :'గాంధీలో జరుగుతున్న చికిత్సపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి'
TAGGED:
kothagudem latest news today