భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర గ్రామంలో క్షుద్ర పూజలు చేస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. గ్రామంలోని ఓ ఇంట్లో క్షుద్ర పూజలు చేస్తుండగా గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
క్షుద్ర పూజలు చేస్తున్న ముగ్గుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు - badradri kothagudem latest news
లోకం మారుతున్నా కొందరు మాత్రం వారి పద్ధతులు మార్చుకోవడం లేదు. మూఢనమ్మకాలను నమ్మి జైలుపాలవుతున్నారు. బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర గ్రామంలో క్షుద్ర పూజలు చేస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
![క్షుద్ర పూజలు చేస్తున్న ముగ్గుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు police-arrested-three-persons-who-practiced-occult-worship-in-there-home-at-morampalli-banjara-village-badradri-kothagudem-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7711904-thumbnail-3x2-kmm.jpg)
క్షుద్ర పూజలు చేస్తున్న ముగ్గుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
ఈరోజు సూర్య గ్రహణం కావడం వల్ల చేతబడులు, క్షుద్ర పూజలు చేస్తే ఫలిస్తాయని మూఢనమ్మంతో కొందరు క్షుద్ర పూజలకు తెరలేపారు.
ఇదీ చూడండి: హైదరాబాద్ నుంచి కరోనా మందు.. వారంలో హెటిరో ద్వారా 'కొవిఫోర్'