Police arrested who were illegally transporting marijuana: సులభంగా తక్కువ కాలంలో అధిక మొత్తంలో నగదు సంపాదించాలని దురుద్దేశంతో చాలామంది యువకులు అక్రమ గంజాయి రవాణాకు అలవాటు పడుతున్నారు. ఇలా చేయడం వలన పోలీసులకు గంజాయితో దొరికి.. వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా రాష్ట్రంలో కొంత మందిని గంజాయి అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి ఒడిశా నుంచి భద్రాచలం మీదుగా మహారాష్ట్రకు కారులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్నాడని అధికారులు తెలుసుకున్నారు. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం చెక్పోస్ట్ దగ్గర పోలీసులు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిఘా ఉంచారు. ఆ సమయంలో అక్కడకి వచ్చిన నిందితుడ్ని పట్టుకున్నారు. స్మగ్లర్ నుంచి 180 కేజీల గంజాయి, కారుని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలో మూడు లక్షలకు కొనుగోలు చేసి మహారాష్ట్రలో రూ.36 లక్షలకు అమ్ముకునేందుకు వెళుతున్న క్రమంలో పట్టుకున్నారు. నిందితుడిని కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
284కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు: నల్గొండ జిల్లాలో కూడా ఇలానే మరో వ్యక్తి పోలీసులకు చిక్కాడు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన శక్తితని గైరాజు(43) మాచర్ల నుంచి హైదరాబాద్కు అక్రమంగా గంజాయి రవాణా చేస్తుండగా.. పోలీసులు పెద్దపూర సమీపంలో పట్టుకున్నారు. నిందితుడ్ని అరెస్టు చేసి రూ.55లక్షలు విలువ చేసే 284 కేజీల గంజాయి, ఒక కారు, 3 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.