భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జేడీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్లాస్టిక్ సీసాల క్రషర్ మిషన్ను ప్రారంభించారు. ప్లాస్టిక్ రహిత పట్టణంగా భద్రాచలాన్ని తీర్చిదిద్దేందుకు 11నెలలుగా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సెప్టెంబర్ 7 నాటికి దేశంలోనే ప్లాస్టిక్ నివారణ పట్టణంగా మార్చుతామన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై చేపడుతున్న అవగాహన కార్యక్రమాలతో చాలా వరకు వినియోగం తగ్గిందన్నారు. అనంతరం ప్లాస్టిక్ రహిత సంచుల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర, పట్టణ ప్రముఖులు, జేడీ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
సెప్టెంబరు 7నాటికి ప్లాస్టిక్ రహితం పట్టణం: మాజీ జేడీ - cbi ex jd laxminarayana
భద్రాచలంలో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ సీసాల క్రషర్ మిషన్ను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రారంభించారు.
సెప్టెంబరు 7నాటికి ప్లాస్టిక్ రహితం పట్టణం: జేడీ