భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రాంతంలోని సింగరేణి కార్యాలయం ఆవరణలో సింగరేణి ఉన్నతాధికారి ఆనందరావు ఆధ్వర్యంలో 3 వేల మొక్కలను పంపిణీ చేశారు. జేకే ఓపెన్‌కాస్ట్ పరిసర గ్రామాల్లో మొక్కలను పెంచడం కోసం పండ్లు, ఇతర మొక్కలు అందజేశారు. ఉసిరికాయలపల్లి, పొలంపల్లి తండా గ్రామ సర్పంచ్‌లు బన్సీలాల్, సక్రులకు మొక్కలు అందజేశారు.
మొక్కలను పెంచడం వల్ల మనిషికి ఎన్నో లాభాలున్నాయని సింగరేణి ఉన్నతాధికారి ఆనందరావు అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పండ్ల మొక్కలతో పాటు పలు రకాల మొక్కలను పెంచాలని ఆయన సూచించారు.
సింగరేణి పరిసర ప్రాంతాలన్నీ పచ్చగుండాలి: ఆనందరావు - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వార్తలు
హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని సింగరేణి ఉన్నతాధికారి ఆనందరావు అన్నారు. ఇల్లందులోని సింగరేణి కార్యాలయం ఆవరణలో ఆయన మొక్కలను పంపిణీ చేశారు.
జేకే ఉపరితల గని సమీపంలోని గ్రామాలకు మొక్కల పంపిణీ
నాటిన ప్రతిమొక్కను సంరక్షించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం పీవీ సత్యనారాయణ, పీవో బొల్లం వెంకటేశ్వర్లు, పర్యావరణ అధికారి సైదులు, సీనియర్ పర్సనల్ అధికారి శ్రీహరి, యూనియన్ ఫిట్ కార్యదర్శి సంజీవరావు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: పెళ్లి, పుట్టిన రోజు వేడుకల్లో మొక్కలు నాటాలి: మంత్రి మల్లారెడ్డి