పోడు భూములపై అంశంలో అటవీ అధికారులపై ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అటవీ అధికారుల తీరుపై యుద్ధానికి సిద్ధం కావాలంటూ ఫేస్బుక్ పేజ్లో పోస్టులు చేశారు.
'అటవీ అధికారులతో ఎమ్మెల్యే యుద్ధం' - mla Rega Kantha rao about Podu lands
పోడు భూముల అంశంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బందిపై ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఘాటు విమర్శలు చేశారు. వారిని విమర్శిస్తూ.. యుద్ధానికి సిద్ధం కావాలని ఫేస్బుక్లో పోస్టులు పెట్టారు.
పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు
పోడు భూముల విషయంలో అటవీ అధికారుల తీరు మారడం లేదని, వారిపై యుద్ధం చేయాల్సిందేనని రేగా కాంతారావు స్పష్టం చేశారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకుని అటవీ అధికారులపై యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
గ్రామాలకు అటవీ అధికారులను రానీయొద్దని, ఒకవేళ వస్తే నిర్బంధించాలని సూచించారు. ఇప్పుడే వారితో అమీతుమీ తేల్చుకోకపోతే రోడ్లపై అడుక్కొని తినాల్సిన దుస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి :రిజిస్ట్రేషన్ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ