భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం తుండబాల తండాలో ఎటువంటి అనుమతి లేకుండా మొక్కజొన్న విత్తనాలు విక్రయిస్తున్న ధరావత్ రామ్‌లాల్‌ను టాస్క్‌ఫోర్స్, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా దాడి చేసి పట్టుకున్నారు. అతని ఇంట్లో 6 ప్యాకెట్ల మొక్కజొన్న విత్తనాలను, వందకు పైగా మొక్కజొన్న విత్తనాల ఖాళీ బస్తాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
మొక్కజొన్న విత్తనాలు అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ - crime news
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తుండబాల తండాలో అనుమతి లేకుండా మొక్కజొన్న విత్తనాలు విక్రయిస్తున్న వ్యక్తిపై అధికారులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ఎవరు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అనుమతి లేకుండా మొక్కజొన్న విత్తనాలు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
అనుమతి లేకుండా విత్తనాలను విక్రయిస్తే ఎవ్వరైనా చర్యలు తప్పనని హెచ్చరించారు. ఈ సోదాల్లో మండల వ్యవసాయ అధికారి సతీష్, కొమరారం ఎస్ఐ రవికుమార్, కొత్తగూడెం నుంచి వచ్చిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు జగన్, వేణు, విజయ్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: నకిలీ విత్తనాల ముఠా అరెస్ట్ : సీపీ సత్యనారాయణ